HomeMovie Newsఅనుష్క శెట్టి 'ఘాటీ' రిలీజ్ డేట్ ఫిక్స్

అనుష్క శెట్టి ‘ఘాటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -

ఇటీవల యువ నటుడు నవీన్ పోలిశెట్టితో కలిసి పీ. మహేష్ దర్శకత్వంలో రూపొందిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్నారు అనుష్క శెట్టి. దాని అనంతరం తాజాగా ఆమె చేస్తున్నటువంటి యాక్షన్ లేడీ ఓరియంటెడ్ సినిమా ఘాటి.

వాస్తవానికి ఏప్రిల్ 18న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా కొన్నాళ్లపాటు రిలీజ్ వాయిదా పడింది. తాజాగా తమ సినిమాని జూలై 11న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేస్తున్నట్లు ఘాటి మూవీ మేకర్స్ అయితే అధికారికంగా డేట్ అనౌన్స్ చేశారు. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది.

అనుష్క శెట్టితో పాటు విక్రమ్ ప్రభు కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాపై అందరిలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ద్వారా అనుష్క శెట్టి అరుంధతి అనంతరం మరొకసారి తన నటవిశ్వరూపాన్ని చూపించడం ఖాయమని అలానే క్రిష్, అనుష్కల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా రిలీజ్ అనంతరం భారీ విజయం అందుకుంటుందని టీం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

ఓవరాల్ గా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతున్న ఘాటి మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జులై 11న రిలీజ్ అనంతరం ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి. 

See also  విక్టరీ వెంకటేష్ తో త్రివిక్రమ్ మూవీ ఫిక్స్ ?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories